User Avatar News

ఎఐకెఎంఎస్ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పల్ల వెంకట నాయుడు

అఖిల భారత రైతు కూలి సంఘం (ఎఐకెఎంఎస్) ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పల్ల వెంకట నాయుడు నియామకం జరిగింది. గత రెండు రోజులుగా అనంతపురంలో జరుగుతున్న తొమ్మిదవ రాష్ట్ర మహాసభలు శనివారంతో ముగిసాయి. దీనిలో జిల్లా కార్యదర్శి, రాష్ట్ర కోశాధికారిగా వెంకట నాయుడు, రాష్ట్ర ఉపాధ్యక్షులుడుగా మండల దుర్గాప్రసాద్, రాష్ట్ర కమిటీ సభ్యులుగా జే సత్తిబాబు, బి బుచ్చిరెడ్డి నియామకం జరిగింది. ఎఐకెఎంఎస్ బలోపేతానికి కృషి చేస్తానని, నియామకంపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిపట్టి వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి. సుధాకర్ లకు కృతజ్ఞతలు వారు తెలిపారు.