User Avatar News

ఉపాధ్యాయురాలు కుటుంబానికి యుటిఎఫ్ ఆర్ధిక సహాయం

జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో చక్రద్వారబంధం పనిచేసిన తెలుగు ఉపాధ్యాయురాలు వి.బేబీరాణి విద్యా అభివృద్ధి విశేష కృషి చేశారని యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్ అన్నారు. గత వారం రోజుల క్రితం మరణించిన ఉపాధ్యాయులు బేబీరాణి చిత్ర పటానికి యుటిఎఫ్ నాయకులు పూలమాలలు వేసి ఆదివారం నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సంక్షేమ పథకం క్రింద ఆమె కుటుంబానికి రూ. 3 లక్ష చెక్కులను అందజేశారు. యుటిఎఫ్ సభ్యులు మరణించిన తర్వాత కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని ప్రధాన కార్యదర్శి షరీఫ్ అన్నారు. దీనిలో అసోసియేట్ అధ్యక్షులు రూపస్, కుటుంబ సంక్షేమ ప్రధాన కార్యదర్శి సురేంద్ర , జిల్లా నాయకులు ప్రకాష్ డివివి,జిల్లా కార్యదర్శి రమేష్ దయానిది, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అనిల్ కుమార్, విజయ్ బాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రాజేశ్వరి, ఉపాధ్యాయులు విజయరత్నం, శ్రీనుబాబు, బాబి,నానాజీ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.