User Avatar Political

ప్రభుత్వం తీరును ఎండగడుతూ వచ్చే నెల 5వ తేదీన రాజానగరం పార్టీ కార్యాలయంలో సమావేశం.

కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, దౌర్జన్యాలు ఎండగడుతూ వచ్చే నెల 5వ తేదీన రాజానగరం పార్టీ కార్యాలయంలో పార్టీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేస్తున్నామని వైకాపా నాయకులు మండల కన్వీనర్ దూలం పెద్ద, మాజీ జెడ్పీటీసీ వాసంశెట్టి పెద్ద, మండల కో కన్వీనర్ గండి నానిబాబు, మాజీ కన్వీనర్ మండారపు వీర్రాజు మాజీ సర్పంచ్ కుందేటి ప్రసాద్ తదితరులు తెలిపారు. పార్టీ కార్యాలయం ఆవరణలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ సచివాలయం పరిధిలో 144 మందితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, జక్కంపూడి అభిమానులు రావాలని కోరారు. ఇసుక మట్టి దోపిడి, మధ్యం షాప్ లు కూటమి నాయకులు నడుపుతూ ఎంఆర్పీ ధర కన్న ఎక్కువ అమ్మడంతోపాటు 24 గుంటలు ప్రతి పాన్ షాప్ అక్రమ అమ్మకాలు జరుగుతున్నారన్నారు. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ప్రభుత్వం ఉద్యోగుల నుండి డబ్బులు తీసుకోవడం వలన ప్రభుత్వ కార్యాలయాల్లో భారీ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాపు యువత, జనసేన నాయకులు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నమ్ముకుని మోసపోయి ఏమి చేయాలి తెలియక ఇంటిలో ఉన్నారన్నారు.