User Avatar News

సీతానగరం-4 అంగన్వాడీ కేంద్రంలో సిబ్బంది సస్పెన్షన్ కు.. జిల్లా కలెక్టర్ ఆదేశాలు

తూర్పు గోదావరి జిల్లా సీతానగరం-4 అంగన్వాడీ కేంద్రంలో ప్రీ-స్కూల్‌ పిల్లలను లోపల ఉంచి గడియ పెట్టడాన్ని జిల్లా కలెక్టర్‌ కీర్తి చేకూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి కారణమైన వారిపై సస్పెన్షన్ చేయాలని ఐసీడీఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ టి. శ్రీదేవిని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రంలో పిల్లలను లోపల ఉంచి గడియ పెట్టి అంగన్వాడీ కార్యకర్త, ఆయా సమీపంలో వినాయకుడి ఆలయం భోజనాలు వెళ్లారు. దీనిపై తీవ్రంగా స్పందించన జిల్లా కలెక్టర్‌ కీర్తి చేకూరి చిన్నారుల భద్రతపై నిర్లక్ష్యాంగా ఉన్న సిబ్బందిపై సస్పెన్షన్‌, శాఖాపరమైన చర్యలు చేపట్టాలని ఐసీడీఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ను ఆదేశించారు.            షోకాజ్‌ నోటీసులు జారీ.. కలెక్టర్‌ ఆదేశాల మేరకు కోరుకొండ ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలోని సీతానగరం-4 అంగన్వాడీ కేంద్రం కార్యకర్త జి. ఉమా మహేశ్వరి, ఆయా టి. లావణ్యలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీదేవి తెలిపారు. ఈ అంగన్వాడీ కేంద్రంపై సమగ్ర విచారణ జరిపి పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని  సీతానగరం సెక్టారు సూపర్‌వైజర్‌కు ఆదేశించారు. విచారణ నివేదిక, ఆధారంగా శాఖాపరమైన చర్యలు ఉంటాయని ఆమె తెలిపారు.

.