User Avatar News, Political

ఒకవైపు గోదావరి నీళ్ళు రావడం లేదు… మరోవైపు గోదావరి నీళ్ళకు సంఖుస్థాపనలు

మెదటిదానికి మెగుడు లేడు కానీ రెండో దానికి పెళ్లి ముహుర్తాలు పెట్టినట్టు ఉంది రాజానగరం నియోజకవర్గంలో అధికారులు, కూటమి నాయకుల తీరు. గత నెలన్నర  నుండి గోదావరి నీళ్ల కోసం ఎదురుచూస్తున్న చుక్క మంచి నీరు రాకున్నా పట్టించుకోకుండా రానున్న రోజుల్లో గోదాదరి నీళ్ల అందించే లక్ష్యంతో నియోజకవర్గంలో జల జీవన్ మిషన్ అమరజీవి జలధార ద్వారా రూ.473 కోట్లతో ప్రజలకు మంచినీళ్ల అందించడానికి బుధవారం సంఖుస్థాపనలు చేయడం చర్చనీయాంశమైంది. రాజమహేంద్రవరం రూరల్ మండలం బొమ్మూరు కొండపైన ఉన్న ట్యాంకుల్లోకి గోదావరిలో నీటిని పంపింగ్ చేసిన తర్వాత పైపులైన్లు ద్వారా నామవరం, పుణ్యక్షేత్రం, వెలుగుబొంద, చక్రద్వారబంధం, ఫరిజిల్లిపేట, రాజానగరం, పాలచర్ల గ్రామాలకు సరఫరా జరుగుతుంది. బొమ్మూరులో హెడ్వర్క్సు యంత్రాల సమస్యలు, గోదావరిలో తగినంత నీళ్ల లేకవపోవడం వలన నీటి సరఫరా నెల న్నర రోజుల నుండి ఆగిపోయింది. దీంతో ప్రజలు మంచినీళ్లను గ్రామాల్లో ప్రైవేట్ ఆర్వో ప్లాంట్లు నుండి కొనుక్కుని తాగుతున్నారు. ప్రజలు గోదావరి నీళ్ల కోసం ఆశగా ఎదురు చూస్తున్నా అధికారులు ప్రత్యమ్నయ ఏర్పాట్లు చేయలేదు, పట్టించుకోలేదు. ఈ నేపధ్యం జల జీవన్ మిషన్ అమరజీవి జలధార ద్వారా బస్టాండ్ రాజానగరంలో రూ.194 కోట్లు, కోరుకొండలో రూ.279 కోట్లుతో గోదావరి నుండి మంచినీళ్ల అందిచండానికి ఎమ్మెల్యే బత్తల బలరామకృష్ణ, టిడిపి జిల్లా అధ్యక్షుడు బొడ్డు వెంకటరమణ చౌదరి, బిజెపి నాయకులు సంఖుస్థాపనలు చేశారు. దీని ద్వారా మండలంలో శ్రీరాపుంరంలో డి.హెచ్.బి.ర్ ఏర్పాటు చేసి రాజమహేందవరం రూరల్ మండలంలో పిడుంగొయ్య, భూపాలపట్నం, పుణ్యక్షేత్రం, దివాన్ చెరువు, కొత్తతుంగపాడు, పాతుతుంగపాడు, ముక్కినాడ, శ్రీకృష్ణపట్నం, పాలచర్ల, చక్రద్వారబంధంలో డి.హెచ్.బి.ఆర్ ద్వారా ఫరిజిల్లిపేట, ముక్కినాడ, నామవరం, పల్లకడియం, రామస్వామిపేట, కలవచర్ల, సందరాడ, నరేంద్రపురం, చక్రద్వారబంధం, రాజానగరం, సీతారాంపురం, వెలుగుబొందతోపాట సీతానగరం, కోరుకొండ మండలాల్లో గ్రామాలకు మంచినీళ్ల అంది చాలనే లక్ష్యంగా సంఖుస్థాపనలు చేశారు. నియోజకవర్గంలో ప్రజలకు రక్షత గోదావరి జలాలు అందించడానికి కూటమి ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందని ఎమ్మెల్యే బత్తల, జిల్లా అధ్యక్షుడు బొడ్డు తెలిపారు. అయితే నెలన్నర రోజులుగా గోదావరి నీళ్ల రాకపాయినా అధికారులు, నాయకులు పట్టించుకోలేదు కానీ కొత్తగా గోదావరి నీళ్ల కోసం సంఖుసాపనలు ఏమేరకు ఉపయోగపడుతుంది వేచి చూడాలి…?