User Avatar News

జిల్లాలో 1.33 లక్షల రైతుల ఖాతాలో రూ.88.64 కోట్ల  అన్నదాతా సుఖీభవ–పీఎం కిసాన్….కలెక్టర్ కీర్తి చేకూరి 

జిల్లాలో అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకం 1,33,156 మంది రైతుల ఖాతాలో రూ.88.64 కోట్ల తొలి విడతగా జమ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. రాజానగరం మండలం ప్రజా పరిషత్ కార్యాలయం హాల్లో అన్నదాతా సుఖీభవ–పీఎం కిసాన్ పథకం నిధుల విడుదల కార్యక్రమం శనివారం జరిగింది. దీనిలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏడాదికి రూ.6 వేలు రాష్ట్ర ప్రభుత్వం, అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.14 వేలు కలిపి మొత్తం రూ.20 వేల పెట్టుబడి సాయంగా ప్రభుత్వం అందిస్తున్నారు. 2026-27కు తొలి విడతగా రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేలు, కేంద్ర ప్రభుత్వం రూ.2 వేలు మొత్తం రూ.7 వేలు అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. దీనిపై రుడా చైర్మన్ బొడ్డు వెంకట రమణ చౌదరి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని, ఈ పధకం ద్వారా
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 46,85,838 మంది రైతు కుటుంబాలకు రూ.3,125.47 కోట్లు విడుదల చేయడం జరిగిందని చెప్పారు. దీనిలో జిల్లా వ్యవసాయ అధికారి బి. వెంకటేశ్వరరావు, జిల్లా హార్టికల్చర్ అధికారి ఎన్. మల్లిఖార్జునరావు, డి పి ఎం తాతారావు , వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.