User Avatar News

ఐ.ఎ.ఎ.వి.ఓ.విజయనగరం జిల్లా మహిళా చైర్మన్ లెంకా రాణి కుమారి కి” గౌరవ డాక్టరేట్….

విజయనగరం జిల్లాకు చెందిన లెంకా రాణి కుమారి మహిళా చట్టాలపై, బాదిత మహిళలకు న్యాయపరమైన సహకారాలు ఐ.ఎ.ఎ.వి.ఓ. సంస్థ ద్వారా అందించినందుకు యునైటెడ్ నేషనల్, ఇంటర్ నేషనల్ పీస్ యునివర్సిటీ, సంస్కృత ప్రాచీన యోగ విశ్వవిద్యాలయం శనివారం గౌరవ డాక్టరేట్ అవార్డు ప్రదానం చేశారు. ఆమె ఇండియన్ యాక్ట్స్ అవెర్నేస్ వాలంటరీ ఆర్గనైజేషన్ అనుబంధ సంస్థ మన హక్కులకై పోరాడు సాధించు ఉద్యమ సంస్థ ఆద్వర్యంలో అనేక కార్యకామాలు చేపట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ రాణి కుమారి ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అద్యక్షుడు అయ్యంకి సురేష్ బాబు, రాష్ట్ర చైర్మన్ సయ్యద్ లాల్ సాహెబ్, ఆర్గనైజేషన్ సభ్యులు, చేన్న శ్రీనివాస్, లింగాల శ్రీనివాస్, రవి కిరణ్, రేణుకా, మంగేశ్వరీ, జ్యోతి, సుధ, లక్ష్మీ, కళావతి, శ్రీదేవి అభినందనలు తెలిపారు.