User Avatar News

నామినేషన్లు పత్రాలు పూర్తిగా అన్ని కాలమ్స్ నింపాలి..

నామినేషన్లు పత్రాలు అన్ని కాలమ్స్ పూర్తి చేసి తీసుకుని రావాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం.వి. రమణ తెలిపారు. నామినేషన్లు 21వ తేదీ 23వ వరకు సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలి కోరారు.  రాజానగరం మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో రాజకీయ పార్టీ సమావేశం సోమవారం నిర్వహించారు. దీనిలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ వేసిన నామినేషన్లు 24వ తేదీ ఉదయం 8 ఎనిమిది గంటల నుండి పరిశీలన జరుగుతుందని తెలిపారు. పరిశీలనలో తిరస్కరించిన దరఖాస్తు 25వ తేదీన ఆర్డీవో  కు అప్పీల్  చేసుకునే అవకాశం ఉందని చెప్పారు.  ప్రైవేట్ స్ధలంలో సమావేశాలు పెట్టినా స్థలం యజమాని అనుమతులు ఉండాలన్నారు. అభ్యర్థికి ఒక వాహనం ప్రచారానికి అనుమతి ఇవ్వడం జరుగుతుందని దీనికి 48 గంటల ముందుగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పోటీ చేసే అభ్యర్ధులు ఖర్చులు వివరాలు రికార్డులో నమోదు చేయాలన్నారు. సిఐ ప్రసన్న వీరయ్య గౌడ్ మాట్లాడుతూ పోటీ చేసే అభ్యర్థితో మరో ఇద్దరు మాత్రమే నామినేషన్ దాఖలు చేయడానికి అనుమతులు ఉంటాయన్నారు.  24 గంటల్లో ఎప్పుడైనా సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. దీనిలో తహశీల్దార్ చుండ్రు దివ్యభారతి, ఎంపిడిఓ జెఎ ఝాన్సీ రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు.