User Avatar News, Political

రాజానగరం జెడ్పీటీసీ, జిల్లా చైర్మన్ పదవులకు ఎమ్మెల్యే సతీమణి బత్తుల వెంకటలక్ష్మి…?

రాజానగరం జెడ్పీటీసీ స్ధానానికి ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సతీమణి వెంకటలక్ష్మి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. జెడ్పీటీసీ గా విజయం సాధించిన తర్వాత జిల్లా ప్రజా పరిషత్ చైర్మెన్ పదవి దక్కించుకోవాలని ఎమ్మెల్యే బత్తుల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈమేరకు ఎమ్మెల్యే కూటమి అధిష్టానం నాయకులతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. జిల్లాలో 21 జెడ్పిటీసీ స్థానాలకు ఈనెల 21వ తేదీ నుండి 23వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరణ జరుగుతుంది. జనరల్ మహిళలకు రాజానగరం, నిడదవోలు, రంగంపేట, బిక్కవోలు, గోపాలపురం స్థానాలు కేటాయించారు. జిల్లా పరిషత్ చైర్మన్ పదవి జనరల్ మహిళకు కేటాయించడంతో రాజానగరం జెడ్పిటిసి సభ్యురాలుగా బత్తుల వెంకటలక్ష్మి కూటిమి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించి చైర్మన్ పదవి దక్కించుకోవాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే జరిగితే మండలంలో జరిగితే ఎంపిటిసి, జెడ్పీటీసీ స్థానాల్లో కూటిమి హవా కొనసాగుతుంది. అయితే జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి మరో ముగ్గురు పోటీ పడుతున్నారు. కూటమి నాయకులు ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించ లేదు.