User Avatar News

పాలచర్ల వార్డు సభ్యులు రిజర్వేషన్లు కేటాయింపులో నిబంధనలు ఉల్లంఘించిన అధికారులు..?

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బిసీలకు 26.73%శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర క్యాబినెట్ ఆదేశాలను రాజానగరం మండల ప్రజా పరిషత్ అధికారులు నిబంధనలు ఉల్లంఘించారు. మండలంంలో పాలచర్లలో బిసిలు ఉన్నా ఒక్క గ్రామ వార్డు కేటాయించకపోవడం అధికారుల రిజర్వేషన్ కేటాయింపు ప్రక్రియ ఏవిధంగా ఉంది తెలుస్తుంది. గ్రామంలో మెత్తం 2352 మంది ఓటర్లు ఉన్నారు. దీనిలో ఎస్టీ 7, ఎస్సీ 775, బిసీ 575, ఓసి 995 ఓట్లు ఉన్నాయి. దీనికి సర్పంచ్ అభ్యర్ధిగా ఎస్సీ మహిళకు కేటాయిస్తే 1, 2 వార్డు లు ఎస్సీ జనరల్, 3 వార్డు ఎస్టీ మహిళ, 4 5 ఎస్సీ మహిళ, 6 9 జనరల్ మహిళ. 7 ,8 ,10 వార్డులు జనరల్ కు కేటాయించారు. గ్రామంలో 575 ఓట్లు ఉన్న బిసీలకు ఒక్క వార్డు కేటాయింపు లేదు. ప్రభుత్వం సిఫార్సు మేరకు పాలచర్లలో కనీసం రెండు వార్డులు బిసిలకు కేటాయించాల్సి ఉంది. అయితే రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన కమిషన్ సిఫార్సుల ప్రకారం బీసీ రిజర్వేషన్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు 26.73% క్షేత్రం స్థాయిలో అమలు కావడం లేదు.