User Avatar News

త్యాగాలు చేయండి… హక్కులు అడగవద్దు.

త్యాగాలు చేయండి హక్కులు అడగవద్దని బిజెపి ప్రభుత్వం అంటుందని ప్రగతి శీల మహిళా సంఘం (పిఓడబ్యూ) రాష్ట్ర అధ్యక్షురాలు ఎం. లక్ష్మి అన్నారు. హక్కుల కోసం ప్రశ్నిస్తే దేశ ద్రోహం పేరుతో తప్పుడు కేసులు నమోదు చేస్తుందని ఆరోపించారు. రాజానగరంలో శ్రీ రాజా కాండ్రేగుల జోగి జగన్నాథ బహుదూర్ అన్నదానం సత్రం హాల్లో పిఓడబ్యూ 9వ జిల్లా మహాసభ కార్యవర్గ సభ్యులు బి. శ్రీదేవి, కె.ప్రసన్న అధ్యక్షత మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పిఓడబ్యూ జెండాను బి. శ్రీదేవి ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షురాలు ఎం. లక్ష్మి మాట్లాడుతూ పోరాటాల ఫలితంగా పసిపిల్లలు రక్షణ కోసం వచ్చిన ఫోక్స్ చట్టం రక్షణ దీనికి ప్రత్యేక ప్రభుత్వం యంత్రాలు ఏర్పాటు చేయలేదన్నారు. మహిళా రక్షణకు కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. దీనిలో రాష్ట్ర నాయకులు ఈమని లక్ష్మి, జె. సత్యవతి, భవానీ, సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి జె.వెంకటేశ్వర్లు, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.