User Avatar News

అభివృద్ధి పేరుతో దోపిడీ… గడువు ముగిసినా ఆగని చెవుల్లో తవ్వకాలు…..

రాజానగరం నియోజకవర్గంలో అభివృద్ధి పేరుతో దోపిడీ జరుగుతుంది. ప్రభుత్వం ఖజానాకు చేరాల్సిన కోట్లాది రూపాయలు అధికారులు, నాయకుల జేబుల్లోకి వెలుతుంది. రానున్న వర్షాకాలంలో గ్రామాల్లో చెరువులు పూడికలు తీసి నీటితో నింపాలి అనేది ప్రభుత్వం లక్ష్యం. దీనిని అడ్డు పెట్టుకుని చెరువు గర్భంలో ఉన్న మట్టిని ఇష్టానుసారం తవ్వకాలు జరుపుతున్నారు. తవ్వకాలకు తీసుకున్న అనుమతి గోరంత దానిని అడ్డు పెట్టుకుని కొండంత తవ్వకాలు జరిపారు. అనుమతి తీసుకున్న గడువు పూర్తి ఆయినా సరే తవ్వకాలు జరుపుతుండడం విశేషం. నియోజకవర్గంలో గ్రామాల్లో ఉన్న ప్రతి చెరువు తవ్వకాల్లో ఇదే జరుగుతుంది. గత నెల 11వ తేదీన 30 రోజుల్లోగా రాజానగరం మండలం నరేంద్రపురం గ్రామంలో సానా వారి చెరువులో మట్టి 18 వేల క్యూబిక్ మీటర్ల తవ్వకాలకు గ్రామానికి చెందిన ప్రగడ వీర్రాజు వ్యక్తికి ఇరిగేషన్ అధికారులు అనుమతులు మంజారి చేశారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అధికారుల పర్యవేక్షణలో తవ్వకాలు జరపాలి. ఈమేరకు అతను ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించడం జరిగింది. దీనిని అడ్డుపెట్టుకుని చెరువులో ఇష్టానుసారం భారీ ప్రొకైయిన్లు, లారీలతో తవ్వకాలు జరుపుతున్నారు. గడువు పూర్తయిన రెండు రోజులు గడుస్తున్నా తవ్వకాలు జరుగుతున్నాయి. అధికారులు అనుమతించిన 18 వేల క్యూబిక్ మీటర్ల అయితే సుమారు రెండున్నర లక్షల క్యూబిక్ మీటర్ల పైగా చెరువులో మట్టి తవ్వకాలు జరిపి ప్రభుత్వం ఆదాయానికి భారీ గండి కొట్టారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడం వలన రాత్రి వేళల్లో తవ్వకాలు జరిగాయి. ఇష్టానుసారంగా రాత్రి వేళల్లో అనుమతి మించి నర్సరీ తోటలకు, రియల్ ఎస్టేట్ వెంచర్లులోకి మట్టి అమ్మడంతో లక్షలాది రూపాయలు ఆర్జించారు. వీటిని అధికారులు, నాయకులు వాటాలు వేసుకుని పంచుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. గ్రామాలు అభివృద్ధి చేస్తామని చెప్పిన నాయకులు, అధికారులు పదవులను అడ్డు పెట్టుకుని దోచుకుంటున్నారు. అభివృద్ధి పేరుతో జరుగుతున్న దోపిడీనీ అరికట్టాలి లేనిచో రానున్న రోజుల్లో గ్రామాల ప్రజలకు తాగు నీరు, సాగు నీరు అందిస్తున్న చెరువులు మనుగడ ఉండదు.