User Avatar Crime, News

వడిశలేరు ఎడిబి రోడ్ పై ట్రాక్ ఆటో బోల్తా… ముగ్గురు మృతి… ఏడుగురికి తీవ్రగాయాలు…

రంగంపేట మండలం వడిశలేరు సమీపంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఏడుగురుకి తీవ్రగాలైనాయి. వీరంతా రోజు వారీ పనులు చేసుకునే కూలీలు. సామర్లకోటకు చెందిన రోజు వారీ కూలీలు పది మంది ట్రాక్ ఆటోలో గుంటూరు సమీపంలో కొల్లూరు గ్రామంలో పనుల చేసుకుని ఇంటికి వెళుతున్నారు. మార్గమధ్యం ఎడిబి రోడ్ ముకుందవరం వెళ్ళే రోడ్ సమీపంలో ఆటో టైర్ పేలుడు వలన అదుపు తప్పి బోల్తా పడిందని భావిస్తున్నారు. దీనిలో ప్రయాణిస్తున్న మసకపల్లి బాలు(21), తాటపూడి రాజేష్(22), తాటపూడి రాజేష్(25) అక్కడికక్కడే మృతి చెందారు. ఏడుగురికి తీవ్రగాయాలు కావడంతో చికిత్స కోసం 108లో పెద్దాపురం ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం అనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. దీనిపై రంగంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.