User Avatar Crime, News, Political, Sports

రాజానగరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నిరసన.. భారీగా వస్తున్న వైకాపా పార్టీ శ్రేణులు… తీవ్రంగా మారుతున్న పరిస్థితులు..

రాజనగరం పోలీస్ స్టేషన్ ఆవరణలో వైకాపా పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జక్కం పూడి రాజా ఆందోళన చేస్తున్నారు. ఆయనను అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ముందు అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. దీంతో పోలీస్ స్టేషన్ సమీపంలో వైకాపా కార్యకర్తలు, నాయకులు భారీగా వచ్చారు. మండలంలో మల్లంపూడిలో జగనన్న కాలనీలో కేటాయించిన ఇళ్ల స్థలాల్లో మంగళవారం అర్థరాత్రి అధికార పార్టీ నేత లు అక్రమంగా మట్టి తవ్వకాలను చేపడుతున్నారు. దీనిని అడ్డుకున్న ప్రయత్నంచిన మాజీ సర్పంచ్ ముప్పిడిశెట్టి వీర చక్ర దొర ఆయన కుమారుడు జస్వంత్ ను పోలీసులు స్టేషన్ కి తీసుకుని వెళ్లారు. దీనిపై రాత్రి ఒంటిగంట సమయంలో మాజీ ఎమ్మెల్యే జక్కం పూడి రాజా పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్రమంగా మట్టి తవ్వకాలను చేస్తున్న వారిని వదిలేసి మాజీ సర్పంచ్, ఆయన కుమారుడు ఎందుకు తీసుకొని వచ్చారని పోలీసులను ప్రశ్నించారు. వెంటనే వాళ్ళను విడిచి పెట్టాలని డిమాండ్ చేస్తూ స్టేషన్ ఆవరణలో బైఠాయించి నిరసన తెలుపుతున్నారు.  ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యేకు మద్దతుగా పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీగా వచ్చారు. అయితే సమయం ఎక్కువైన కొద్దీ పార్టీ శ్రేణులు వస్తారని పోలీసులు భావిస్తున్నారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు జక్కంపూడి రాజాను అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలిసింది. దీంతో పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితిలు నెలకుంది.