User Avatar Sports

నరేంద్రపురంలో 1230 మహిళలకు పట్టు చీరలు పంపిణీ చేసిన కంబాల శ్రీనివాసరావు

రాజానగరం మండలం నరేంద్రపురం గ్రామంలో  కంబాల కానుక వనితల వేడుక కార్యక్రమం విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ జగ్గంపేట నియోజకవర్గం బీఎల్ఏ-1 కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మహిళలకు పట్టు చీరల పంపిణీ  ఘనంగా నిర్వహించారు.  తొలి చీరను గ్రామ దేవతకు సమర్పించారు. అనంతరం గ్రామంలో 1230  మహిళలకు పట్టు చీరలను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళల సంక్షేమం కోసం, అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.  మన ధర్మం యొక్క గొప్పతనాన్ని మన ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలను గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి కోరారు. దీనికి ముందు ఆయనకు మహిళలు హరతులతో ఘన స్వాగతం పలికి, శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. గ్రామంలో ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనిలో బీజేపీ మండల అధ్యక్షులు ఆళ్ల శివ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.