User Avatar Crime, News

జాతీయ రహదారిపై వాహనదారులకు కత్తులతో బెదిరించి డబ్బులు లాక్కున్న యువకులను అరెస్టు….

జాతీయ రహదారిపై పశువుల వాహనాలు ఆపి డ్రైవర్లును కత్తులతో బెదిరించి డబ్బులు లాక్కున్న యువకులను రాజానగరం పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. దీనిపై సిఐ కె. ప్రసన్న వీరయ్య గౌడ్ విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాలు. శ్రీకాకుళం చెందిన ప్రసాద్ పాతపట్నం గ్రామంలో ఆరు ఎద్దులను కొన్నాడు. వీటిని అమరావతి సమీపంలో కోనూరులో వెంకటేష్ అనే రైతుకు ఇవ్వాలని బోలెరో, బడా దోస్త్ వ్యాన్ డ్రైవర్లు కొండపల్లి రవి, తాడేల నవీన్, అలాపన దాలిరాజుతో వ్యాన్లు కిరాయికి మాట్లాడుకున్నాడు. ఈనెల 9వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో ఎద్దుల లోడ్ తో బయలుదేరి మరునాడు ఉదయం 4 గంటలకు రాజానగరం జాతీయ రహదారి ప్రక్కన కాలకృత్యాలు కోసం వ్యాన్లు ఆపడంతో థార్, సుజుకి కారులో పది మంది యువకులు ఆకస్మికంగా వచ్చి వ్యాన్ డ్రైవర్లు కత్తులు చూపించి భయపెట్టారు. ఎద్దుల వ్యాన్ తో కొందరు ఎక్కారు. మరికొందరు వ్యాన్ డ్రైవర్ ను బలవంతంగా కారులో ఎక్కించుకుని పల్లకడియం గ్రామం శివారు పొలాల్లో తీసుకుని వెళ్లి డబ్బులు లాక్కుని పరారైనారు. దీనిపై వ్యాన్ డ్రైవర్ కొండపల్లి రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనిలో రాజమహేంద్రవరం చెందిన కైలాస్ దివాన్, వైష్ణవి అభిషేక్, మాలికైలాష్ కుమార్, జితేంద్ర పురోహిత్, రమేష్ మాది, రమేష్ దేవాషి, పూరన్ కుమార్, భావేష్, దివాస్ రాజేష్ నిందితులుగా గురించి అరెస్టు చేశారు. వీరంతా నగరంలో సోమాలమ్మ గుడి, టి.నగర్, గంటాలమ్మ గుడి, మెయిన్ రోడ్ సమీపంలో సెల్ ఫోన్ షాప్ యజమానులు, వర్కర్స్. వీరు తీసుకుని వచ్చిన రెండు కార్లుకు నెంబర్ ప్లేట్లు కనిపించకుండా గుడ్డలు కొట్టారని పోలీసులు తెలిపారు. చాకచక్యంగా కేసు దర్యాప్తు చేసి నిందితులను గుర్తించి అరెస్టు చేసిన సిఐ ప్రసన్న వీరయ్య గౌడ్, ఎస్ఐ జివివి సత్యనారాయణ సిబ్బందిని డిఎస్పీ సిహెచ్ జీవన, ఎస్పీ నరసింహా కిషోర్ అభినందించారు.