User Avatar News

రాజానగరం మండలం కార్యాలయాల ఆవరణలో గంజాయి, మందుబాబులు హాల్ చల్…

నియోజకవర్గం ప్రధాన కేంద్రం రాజానగరం మండల కార్యాలయాల పాత భవనాల్లో అసాంఘీక శక్తులు తిష్ట వేశాయి. స్థానిక యువకులు దీనిని అడ్డుగా చేసుకుని పగలు గంజాయి, మధ్యం రాత్రి వేళ్లల్లో యువతులతో హల్చల్ చేస్తున్నారు. దీనికి అరికట్టకపోతే మండల కార్యాలయాల ప్రతిష్ట దిగజారి, యువత అకృత్యాలకు అడ్డాగా మారుతుంది. మండల కార్యాలయల ఆరవణలో 2003 ఫిబ్రవరి 15వ తేదీన మండల ప్రజాపరిషత్ కార్యాలయం భవనాన్ని అప్పటి జిల్లా పరిషత్ చైర్మెన్ దున్నా జనార్ధనరావు ప్రారాభించారు. ఈ భవనం పాతది కావడం వలన నూతన మండల ప్రజాపరిషత్ కార్యాలయం భవనం ఏర్పాటు చేసుకుని ప్రస్తుతం ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ పాత భవనణంలో కొంత కాలం మండల వ్యవసాయం కార్యాలయం అధికారులు ఉపయోగించారు. శిథిలావస్థకు చేరి బిల్డింగ్ స్లాబ్ సిమెంట్ పెచ్చులు ఊడి పడడంతో ప్రస్తుతం కార్యాలయానికి తాళం వేశారు. ఇదేవిధంగా దీని ప్రక్కన పాత మండల సమావేశాల కార్యాలయం, ఎదురుగా ఉన్న జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పధకం, గ్రామ పంచయతీ సమవేశ భవనం అప్పటి పంచాయతీ సమితి అధ్యక్షుడు మాచిన వెంకటరామచౌదరి 1981 నవంబర్ తొమ్మిదో తేదీన ప్రారంభించారు. ఈ మూడు పాత భవనాలు పాతవి కావడం వలన కొందరు యువకులు వెనక వైపు ఉన్న తలుపు విరగొట్టి అశాంఘిక శక్తులకు నిలయంగా మార్చుకున్నారు. పగలు మధ్యం, గంజాయి మత్తులో రాత్రి వేళ్లలో యువతులతో ఎంజాయ్ చేస్తున్నారు. పాత మండల కార్యాలయం భవనం ముందు రెండు భారీ పరుపులు వేసి ఉండడం విశేషం. ఈ కార్యాలయాల ఆవరణలో ప్రస్తుతం మండల ప్రజాపరిషత్, తహశీల్దార్, మండల సమాఖ్యా, మండల విద్యాశాఖ తదితర కార్యాలయాలు ఉన్నాయి. దీనిలో పని చేస్తున్న ఉద్యోగులు సాయంత్రం సమయంలో విధులు ముంగించుకుని ఇంటికి వెల్లడానికి బయటకు వెల్లాలంటే భయాంధోళలు చెందుతున్నారు. తాజాగా నాలుగు యువకులు ఆదివారం ఉదయం గంజాయి సేవించి హల్ చల్ చేశారు. మత్తులో ఒకరికొకరు రెచ్చిపోయి విచ్చలివిడిగా కొట్టుకోవడం వలన రక్తం గాయాలయ్యాయి. గుట్టుచప్పడు కాకుండా స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. అయితే  ఆకతాయిలు ఈ పాత కార్యాలయాలు అడ్డాగా చేసుకుని దందాలకు పాల్పడుతున్నారని విమర్శలు వస్తున్నా యి. వీటిని పూర్తిగా తొగించాలి లేదా పూర్తగా భద్రతా సిబ్బంది ఏర్పటు చేసి అశాంఘికపై ఉక్కు పాదం మోపాలి. లేనిచో మండల కార్యాలయాలు గంజాయి, మద్యం సేవించు కార్యాలయాలుగా కొనసాగుతాయి.