User Avatar News

జిల్లాలో ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల డే…..

ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం చేయాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) డిమాండ్ చేశారు. శనివారం జర్నలిస్టు డిమాండ్స్ డే సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం, నియోజకవర్గాల కేంద్రాలు, మండల కార్యాలయాల్లో వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు వి. రవికుమార్ మాట్లాడుతూ జర్నలిస్టుల కు ఆరోగ్య భీమా, ఇళ్ల స్థలాలు, జర్నలిస్టులకు పింఛన్లు, ఏసి ప్రయాణం, మీడియా అకాడమీ కి గవర్నింగ్ కౌన్సిల్ ఏర్పాటు, కార్మిక భీమా సదుపాయం కల్పించాలన్నారు. దీనిలో జిల్లా కార్యదర్శి పోతుల వెంకటేష్, ఉపాధ్యక్షులు దేవులపల్లి అన్నపూర్ణ విశాలాక్షి, చిట్టిబాబు, జిల్లా సహాయ కార్యదర్శులు నీలం ఈశ్వర కూమార్, కుంచే నరసింహారావు, క్రరీంముల్లా, కెవివి సత్యనారాయణ, ఎంఎస్ఆర్ శ్రీనివాసరావు, గాడి రాజారావు తదితరులు పాల్గొన్నారు