User Avatar Devotional

ఘనంగా శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ అమ్మవారికి ఆషాడం సారే

రాజానగరంలో కొలువైన శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ అమ్మవారికి  భక్తులు ఆషాడం సారే భక్తిశ్రద్ధలతో ఆదివారం సమర్పించారు. మేళ తాళాలు, బాణసంచా కాల్పుల, గరగరత్యాలతో  భక్తులు గ్రామంలో వీధుల సారేను చేతబట్టుకొని ఊరేగింపుగా బయలుదేరి మేళ తాళాలు, బాణసంచా కాల్పుల, గరగ నృత్యాలతో నూకాలమ్మ అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు.  అనంతరం వివిధ రకాల తీపిపదార్థాలు, చలిమిడి, వడపప్పు, గాజులు, పండ్లు ను అమ్మవారికి సమర్పించారు. వాటిని ఆలయ ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు తిరిగి పంపిణీ చేశారు. అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో శాకాంబరీ గా అలంకరించారు. ఆలయం భక్తులతో కిటకిటలాడింది.