User Avatar Crime

వికలాంగులైన భార్యను హతమార్చి తర్వాత వికలాండైన భర్త ఉరి వేసుకుని మృతి…

నాడీ వ్యవస్థ వికలాంగురాలైన భార్యాను హతమార్చి తర్వాత వికలాంగుడైన భర్త ఉరి వేసుకుని మృతి చెందిన విషాద సంఘటన రాజానగరం మండలం పాత తుంగపాడలో జరిగింది. గ్రామానికి చెందిన కిమిడి లక్ష్మణరావు (32) రెండు కాళ్ళుకు ఫోలియో వికలాంగుడు, శ్యామల (30) నాడీ వ్యవస్థ లోపం ఉన్న వికలాంగురాలు.  వీరికి 2025 జూన్ 11వ తేదీన ఇద్దరు వివాహం చేసుకుని జగన్న కాలనీలో నివాసం ఉంటున్నారు. వీళ్ళకు పిల్లలు లేరు. లక్ష్మణరావు గత ప్రభుత్వం లో వాలంటీర్ గా పని చేసి ప్రస్తుతం మందల షాప్ నిర్వహిస్తున్నాడు. శనివారం రాత్రి అదే గ్రామంలో నివాసం ఉంటున్న భార్యకు బావ రాంబాబు ఇంటికి భోజనానికి చేసి ఇంటిలో వెళ్ళిపోయారు. రాంబాబు ఆదివారం ఉదయం ఫోన్ చేసినా తీయకపోవడం వలన ఇంటికి వెళ్ళి తలుపులు పగులకొట్టి చూడగా చేతికి గాయాలతో రక్తపు మడుగులో శ్యామల, లక్ష్మణరావు ఇంటిలోపల స్లాబ్ ఐరన్ రింగ్ కు చున్నీ వేసుకుని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే లక్ష్మణరావు మందుల షాపులో నిద్ర మాత్రలు భార్యకు ఇచ్చి ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత చేతి నరాలు కోసి హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడని భావిస్తున్నారు. శ్యామల అన్న స్వామి తన సోదరిని హత్యచేసి లక్ష్మణరావు ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యాదులో తెలిపాడు. మృతదేహాలను రాజమహేంద్రవరం ప్రభుత్వం ఆసుపత్రికి పోస్ట్ మార్టం తరలించారు. సంఘటనా స్థలాన్ని డిఎస్పీ జీవన్ పరిశీలించారు.దీనిపై సిఐ ప్రసన్న వీరయ్య గౌడ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.