User Avatar Crime, News

రైతులు పొలాలు, లేఅవుట్లులో విద్యుత్ వైర్లు, ట్రాన్స్ఫార్మర్ లో రాగి దొంగతనాలు చేస్తున్న ముఠా అరెస్టు …

రైతులు పొలాలు, లేఅవుట్లలో అల్యూమినియం విద్యుత్ వైర్లు, ట్రాన్స్ఫార్మర్ లో రాగి వైర్లు దొంగిలించి వాటిని దిమ్మలుగా చేసి అమ్మకాలు చేస్తున్న రెండు ముఠాలను రాజానగరం పోలీసులు సోమవారం పట్టుకున్నారు. వీరి నుండి సుమారు రూ.8,27,500 విలువైన రాగి అల్యూమినియం సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. దీనిపై సిఐ కె. ప్రసన్న వీరయ్య గౌడ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తెలిపిన వివరాలు. గత ఏడాది జూలై 31వ తేదీన రాజానగరం చెందిన దూలం పెద్ద కొత్తవెలుగుబొంద శివారు శ్రీనివాస లేఅవుట్లో 25 విద్యుత్ స్తంభాల అల్యూమినియం వైర్లు దొంగతనం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదేవిధంగా ఈనెల 19వ తేదీన నందరాడ రెవెన్యూ పరిధిలో కొల్లూరి దుర్గా ప్రసాద్ మామిడి తోట షెడ్ లో 9 స్తంభాల అల్యూమినియం విద్యుత్ వైర్లు దొంగతనం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీటిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా రాజానగరం లేఅవుట్లులో దొంగిలించింది విజయనగరం జిల్లా కొత్తవలస చెందిన మంగి సుధాకర్, అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీ మండలం రంగినిగూడ చెందిన కిల్లో రాజు, పొంగి విజయ్, కొల్లా ప్రహ్లాద్ లను నిందితులుగా గురించి అరెస్టు చేశారు. వీరి నుండి అల్యూమినియం వైర్లు కట్టలు, కరిగించన దిమ్మలు సుమారు రూ. 3,57,500 విలువైన 1430 కేజీలు స్వాధీనం

 

చేసుకున్నారు. మామిడి తోటలో దొంగతనాలు పాల్పడింది గండేపల్లి చెందిన శివగంగ బాబురావు, నేమవరపు మురళీ కృష్ణ, మేడిశెట్టి మణికంఠ, బసమని వీరబాబు, శివగంగ రాజు నిందితులుగా గుర్తించి అరెస్టు చేశారు. వీరి నుండి రూ.4 లక్షల 70 వేలు విలువైన అల్యూమినియం విద్యుత్ వైర్లు, దిమ్మలు 361 కేజీలు, ట్రాన్స్ఫార్మర్ లో ఉన్న రాగి తీగలను కరిగింది దిమ్మలుగా ఉన్నవి 23 కేజీలు స్వాధీనం చేసుకున్నారు.  వీరంతా కోరుకొండ, కొవ్వూరు, రాజానగరం, సీతానగరం స్టేషన్ పరిధిలో దొంగతనాలు పాల్పడి కేసు ఉన్నాయి. నిందితులను గుర్తించి అరెస్టు చేసిన ఎస్ఐలు డివివి సత్యనారాయణ, ఎస్ ప్రియ కుమార్, వై. మురళీకృష్ణ సిబ్బందిని ఎస్పీ నరసింహా కిషోర్, డిఎస్పీ సిహెచ్ జీవన్, సిఐ ప్రసన్న వీరయ్య గౌడ్, అభినందించారు.