User Avatar News

రాజానగరం విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో శనివారం పవర్ కట్

రాజానగరం సబ్ స్టేషన్ పరిధిలో వార్షిక మరామత్తు కారణంగా శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరా ఉండదని ఎపిఇపిడిసిఎల్ ఎక్జిక్యూటివ్ ఇంజినీరు ఆపరేషన్స్ జెపిబి నటరాజన్ తెలిపారు. దీని వలన మల్లంపూడి,  కానవరం సబ్ స్టేషన్  సరఫరా జరుగుతున్న రాజానగరం, సూర్యారావుపేట, ఇండస్ట్రియల్ ఫీడర్, గైట్ కాలేజీ, నన్నయ్య విశ్వవిద్యాలయం, రాజమండ్రి పేపర్ మిల్లు, బ్రిడ్జి కౌంటీ, తూర్పు గోనగూడెం, పల్లకడియం, రామస్వామి పేట, ఐశ్వర్య రైస్ మిల్, లేనోరా డెంటల్ కాలేజీ, క్వారీ, సాక్షి పేపర్, ఐఎస్టీఎస్ కాలేజీ, కానవరం, ఫరిజిల్లిపేట, మల్లంపూడి, తోకాడ, ముక్కినాడ  విద్యుత్ సరఫరా  అంతరాయం ఉంటుందని తెలిపారు.