User Avatar Sports

మధ్యం మత్తులో భార్యను చంపిన భర్త…?

మధ్యం మత్తులో గొడవపడి భార్యను భర్త హత్య చేసిన సంఘటన మండలంలో చక్రద్వారబంధంలో సోమవారం జరిగింది. దీనిపై రాజానగరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. రెండేళ్ల క్రితం మండపేట మండలం తాపేశ్వరం చెందిన మట్టపర్తి నాగబాబుకు రాజమహేంద్రవరం రూరల్ మండలం వేమగిరి చెందిన కుమారి(24)తో వివాహం జరిగింది. వీరికి పిల్లలు లేరు. చక్రద్వారబంధంలో ఇల్లు అద్దెకు తీసుకుని గ్రామం శివారులో బారువాలు కంపెనీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. భార్యభర్తల్దిరు ఈనెల 15వ తేదీన కుమారి అక్క పెళ్లికి వేమగిరి వెళ్లి మరునాడు వచ్చారు. రెండు రోజులు ఉండమని చెప్పినా వినకుండా నాగబాబు భార్యను తీసకుని గ్రామానికి వచ్చేశాడు. ఈరోజు ఉదయం కుమారికి తల్లి వనుము రాధ ఫోన్ చేసినా తీయకపోవడం వలన  నాగబాబుతో బీరుబాలు కంపెనీలో పనిచేస్తున్న స్నేహితుడుకి ఫోన్ చేసి కుమార్తె ఇంటికి వెల్లమని చెప్పింది. ఇంటి తలుపులు ఎంత కొట్టినా తీయకపోవడంతో స్థానికుల సాయంతో గట్టిగా కొ ట్టడంతో చేతిలో కత్తిరతో మెడపై రక్తపు గాయంతో తలుపు తీసి బయటకు వచ్చాడు. కుమారి మెడ మీద నల్లటి మచ్చతో నేలపై స్పృహ లేకుండా పడి ఉంది. హుటాహుటీన జిఎస్ఎల్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయిందని వైద్యులు తెలిపారు. అల్లుడు నాగబాబుకు మధ్యం తాగే అలవాటు ఉందని, పాత గొడవలు వలన తన కుమార్తెను హత్య చేశాడని మతురాలు తల్లి రాధ పొలీసులకు ఫిర్యాదు చేసింది. సంఘటనా స్థలాన్ని డిఎస్పీ సిహెచ్ జీవన్, సిఐ ప్రసన్న వీరయ్య గౌడ్ పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వం ఆసుపత్రికి తరలించి ఎస్.ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.