User Avatar Crime

ఏజెన్సీ ప్రాంతం సీలేరు నుండి తరలిస్తుండగా కొంతమూరులో పట్టుబడిన 25.970 కేజీలు గంజాయి

రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధి సుమారు 25.970 కేజీలు గంజాయి బుధవారం రాత్రి పోలీసులు పట్టుకున్నారు. దీని వలన రూ.4,29,850 ఉంటుంది. ఏజెన్సీ ప్రాంతం నుండి గంజాయి తరలిస్తున్నారని సమాచారం రావడంతో ఎస్‌.ఐ. ఎస్. ప్రియ కుమార్, సిబ్బంది రాత్రి సమయంలో అండర్ బ్రిడ్జి రోడ్ కొంతమూరులో తనిఖీలు చేపట్టారు. దీనిలో సీలేరు నుండి విజయవాడ వెలుతున్న కారులో మూడు పాలిథిన్ సంచుల్లో 25.970 కేజీల గంజాయి పట్టుబడింది. కారులో ఉన్న ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం సారిపల్లె పంచాయితీ చెందిన దులపల్లి సుజీవ్ కుమార్, మోదుగు నరేష్ అరెస్టు చేశారు. విజయవాడలో గంజాయి తీసుకుంటున్న చినమ్సెట్టి రాజేష్, గంజాయి సేకరించిన సీలేరు సమీపంలో చింట్టు చెందిన వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరి నుండి కారు, రెండు ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.