User Avatar Sports

భోజనం చేసి ఆరుబయట కుర్చున్న వ్యక్తిని కబళించన మృత్యువు….

భోజనం చేసి ఆరుబయట కుర్చున్న వ్యక్తిని లారీ ఢీ కొనడంతో మృతి చెందిన సంఘటన మండలంలో మల్లంపూడిలో జరిగింది. గ్రామానికి చెందిన మెగలపు శ్రీను(44) మంగళవారం రాత్రి భోజనం చేసి రహదారి ప్రక్కన కుర్చున్నాడు. కొత్తతుంగపాడు నుండి అనపర్తి వైపుకు వెలుతున్న లారీ అజాగ్రత్తగా నడపడం వలన రహదారి ప్రక్కన ఉన్న శ్రీను కాళ్ళుపై ఎక్కించాడు. దీంతో రెండు కాళ్ళు నుజ్జునుజ్జు కావడంతో రక్తస్రావం జరిగింది. 108లో రాజమహేంద్రవరం ప్రభుత్వం ఆసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  చికిత్స పొందుతూ ఈరోజు శ్రీను మృతి చెందాడు. మృతుడు రోజు పనులు చేసుకునే శ్రామికుడు. ఇతనికి ఇద్దరు కుమారులు, భార్య ఏం.కుమారి ఫిర్యాదు మేరకు రాజానగరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.