User Avatar Sports

120 కేజీల గంజాయి స్వాధీనం…నలుగురు యువకులు అరెస్టు..

రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కార్లలో 120 కేజీల గంజాయి తరలిస్తుండగా పోలీసులు శనివారం పట్టుకున్నారు. నాలుగు యువకులను అరెస్టు చేసి, కార్లు సీజ్ చేశారు. దీనిపై పోలీస్ స్టేషన్లో సిఐ ప్రసన్న వీరయ్య గౌడ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తెలిపిన వివరాలు. మహారాష్ట్ర తానే జిల్లా పింప్లాస్ చెందిన పేట్రియాట్స్ మిత్ ప్రదీప్, ప్రటియాస్ సుందర్ బారుడే, ఆదిత్య అరవింద్, నిఖిల్ మధుకర్ పాటిల్ రెండు కార్లలో గోకవరం నుండి మహారాష్ట్ర సమీపంలో పూణేకు గంజాయి తరలిస్తున్నారని సమాచారం రావడంతో కొంతమూరు దినేష్ దాబా సమీపంలో పోలీసులు తనిఖీ చేస్తుండగా గంజాయి పట్టుబడింది. వీరిపై కేసు నమోదు చేసి 120 కిలోల గంజాయి, ఆరు సెల్ ఫోన్లు, రూ.1770 స్వాధీనం చేసుకుని కోర్టుకు తరలించారు.  గంజాయి విలువ సుమారు రూ. 10 లక్షలు ఉంటుందని వివరాలు సిఐ తెలిపారు. నిందితులను గుర్తించి అరెస్టు చేసిన ఎస్ఐ ఎస్. ప్రియకుమార్, ఈగల్ సిబ్బందిని సిఐ అభినందించారు.