User Avatar Sports

కానవరం చింతగొయ్యి చెరువు విషయంలో ఎస్సీ వర్గాల్లో ఉద్రిక్తత పరిస్థితిలు…

రాజానగరం మండలం కానవరంలో ఎస్సీలకు చెందిన ప్రభుత్వ చెరువుల అక్రమ లీజు వ్యవహారం మాజీ ఎంపిటిసి, విఆర్ఓపై పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. గ్రామానికి చెందిన చింతగొయ్యి చెరువుకు ప్రస్తుతం మత్స్యశాఖ గుర్తింపు లేదు. దీనిపై ఎంపీటీసీ, వీఆర్వో కలిసి అనధికారికంగా చెరువును దావరపల్లి చెందిన వ్యక్తులకు లక్ష రూపాయలు తీసుకుని అనాధికారంగా అనుమతులు మంజూరు చేశారని గ్రామానికి చెందిన పి సూరిబాబు, డి. నరసింహమూర్తి, డి. వెంకన్న, కె. గణపతి, కె సుబ్బారావు, డి. నాగేశ్వరరావు, కె. పోతయ్య, పి. సుబ్బారావు, ఎం. వెంకన్న, డి. నారాయుడు, కె. ఏరోదు, కె. దొర, ఎం. రాజు, ఎం. సత్యనారాయణ, ఎం. నందిబాబు, కె. రాఘవ, డి. చిన్నోడు తదితరులు ఆరోపించారు.  అక్రమంగా చెరువులో చేపలవేట చేపట్టగా అడ్డుకోవడంతో తమకు లీజు ఉందంటూ తప్పుడు పత్రాలను చూపించారన్నారు. కొత్త ఫిషర్‌మెన్ సొసైటీ ఏర్పాటు చేసే ప్రక్రియ కొనసాగుతుందని, తప్పుడు పత్రాలను సృష్టించిన ఎంపిటిసి, విఆర్ఓ, అక్రమంగా చేపల వేట చేపడుతున్న వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజులు గడిచినా పోలీసులు పట్టించుకోకపోవడం అప్పగించిన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పై ఎస్సీ వర్గంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉన్నత అధికారులు చర్యలు చేపట్టాలి. లేనిచో ఎస్సీ సామాజిక వర్గాలలో ఉద్రిక్తతలు ఏర్పడే ప్రమాదం ఉంది.