User Avatar News

భయపెడుతున్న యాసిడ్ పురుగు….

తూర్పు గోదావరి జిల్లాలో యాసిడ్ పురుగు భయపెడుతుంది. ఎక్కువగా ప్రస్తుతం కడియం, ఆలమూరు, రాజానగరం నర్సరీల్లో ఉంది.  వర్షాకాలంలో పొలాల్లో, తోటల్లో వస్తుంది. ఈ పురుగు శరీరంపై వాలితే ఏమీ అవ్వదు కానీ చంపిన తర్వాత వెనుక భాగం నుండి యాసిడ్ లాంటి ద్రవం వస్తుంది. ఇది శరీరానికి అంటుకుని ఎర్రగా మారి దద్దుర్ల వచ్చి చర్మం నల్లగా మారిపోతుంది. సుమారు రెండు వారాలు తర్వాత సాధారణ స్ధితికి వస్తుంది. అయితే ఇది ప్రాణాంతకం కాదు అని వర్షాకాలంలో వస్తుందని దీనిపై అవగాహన కలిగి ఉండాలి అధికారులు కోరుకుంటున్నారు.