User Avatar News

చాగన్నాడు కాలువ గట్లుపై ఉంటున్న పేదలకు నీళ్ళు, విద్యుత్ ఇవ్వకపోతే వచ్చే నెల 10వ తేదీన మాజీ ఎంపీ హర్షకుమార్ నిరాహారదీక్ష..

రాజానగరం చాగన్నాడు ఎత్తి పోతలపధకం కాలువ గట్లుపై పూరె గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న యానాది ఎస్టీ పేటలో నిరుపేదలకు మంచినీళ్ళు, విద్యుత్ ఇవ్వకపోతే వచ్చే నెల 10వ తేదీన నిరాహారదీక్ష చేపడతానని మాజీ ఎంపీ జివి హర్షకుమార్ ప్రకటించారు. దీనిపై ఎంపిడిఓ, తహశీల్దార్, జిల్లా కలెక్టర్ స్పందించాలని కోరారు. కాలువ గట్లుపై నివాసం ఉన్న యానాది ఎస్టీ పేట పూరె గుడిసెలను శనివారం సందర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధితులతో కలిసి విలేఖర్లు సమావేశంలో మాజీ ఎంపీ హర్షకుమార్ మాట్లాడుతూ గతంలో మాజీ ఎమ్మెల్యేలు పెందుర్తి వెంకటేష్, జక్కంపూడి రాజా ప్రస్తుతం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణలకు నీళ్ళు, విద్యుత్ కోసం అనేక అర్జీలు పెట్టినా ఇవ్వలేదన్నారు. ఆధార్ కార్డు ఉన్న వీళ్ళందరికీ కనీసం సౌకర్యాలు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. వచ్చేనెల 10వ తేదీలోగా ఇవ్వకపోతే ఇక్కడ ఉండి నిరాహారదీక్ష చేపడతానని చెప్పారు.