User Avatar News

కె.వి.వి. సత్యనారాయణ రాజు (చైతన్య రాజు)కు జాతీయ వాగ్దేవి జీవిత సాఫల్య పురస్కారం..

జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, పద్మభూషణ్, రాజ్యసభ మాజీ సభ్యులు డాక్టర్ సి. నారాయణరెడ్డి శతజయంతి సందర్భంగా, న్యూఢిల్లీలో జాతీయ తెలుగు సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం ఛాన్సలర్, చైతన్య సంస్థల వ్యవస్థాపకులు  కె.వి.వి. సత్యనారాయణ రాజు (చైతన్య రాజు)కు ప్రతిష్ఠాత్మక “జాతీయ వాగ్దేవి జీవిత సాఫల్య పురస్కారం” ప్రదానం చేశారు.  కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అందజేశారు. దీనిలో రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె. లక్ష్మణ్, బీద మస్తాన్ రావు , లోక్‌సభ సభ్యులు  మాగుంట శ్రీనివాసుల రెడ్డి , వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు తదితర ప్రముఖులు పాల్గొని, చైతన్య రాజును అభినందించారు. ఈ సందర్భంగా తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి పరిరక్షణతో పాటు వాటి అభివృద్ధికి చైతన్య రాజు చేస్తున్న విశిష్ట సేవలను పలువురు కొనియాడారు. తెలుగు భాషా వైభవాన్ని భావితరాలకు అందించేందుకు ఆయన చేస్తున్న కృషి ఆదర్శనీయమని వక్తలు అన్నారు.