User Avatar News

అగ్ని ప్రమాదాలపై అవగాహన ఉండాలి… తక్షణం సేవలు అందించడానికి ప్రైవేట్ సంస్థలలో ఎంఒయు…డిజి వెంకటరమణ

అగ్ని ప్రమాదాలు జరిగిన పది, పదిహేను నిమిషాల్లో వచ్చి సేవలు అందించడానికి ప్రైవేట్ సంస్థలలో అగ్నిమాపక వాహనాలు ఏర్పాటుకు ప్రత్యేక ఎంఒయు కుదుర్చుకున్నామని రాష్ట్ర ఫైర్ సేఫ్టీ డైరెక్టర్ జనరల్ పి. వెంకటరమణ అన్నారు. ఈమేరకు రాష్ట్రంలో ఉన్న ఇండస్ట్రీ ఏరియాను మ్యాపింగ్ చేసి ప్రైవేట్ సంస్థల ద్వారా 129 అగ్ని మాపకదళాల వాహనాలు ఏర్పాటు చేశామన్నారు. రాజానగరం సమీపంలో జిఎస్ఎల్ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో అగ్ని ప్రమాదాలపై యానిమేషన్ అవగాహన కార్యక్రమం, మాక్ డ్రిల్ శనివారం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా డిజి వెంకటరమణ పాల్గొని వైద్య విద్యార్థులకు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు సలహాలు వచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అగ్నిమాపక పాత వాహనాలు తొలగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూ.199 కోట్ల నిధులతో 110 అగ్ని మాపకదళాల వాహనాలు కొనుగోలు చేసి రాష్ట్రంలో కార్యాలయాలు పంపడం జరుగుతుందన్నారు. సిబ్బందికి సరైన పరికరాలు లేవని, ఆరు నెలల్లో వీటి అన్నీ అధిక మించి ప్రత్యేక మార్పులు తీసుకుని వస్తున్నాముని తెలిపారు.  అగ్ని ప్రమాదాలపై అవగాహన కోసం నెలలో నాలుగు కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 60 శాతం ఆసుపత్రిలో అవగాహన కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగిందని వీటి తర్వాత ప్రైవేటు పాఠశాలలో నిర్వహిస్తామన్నారు. దీనిలో రీజనల్ ఫైర్ ఆఫీసర్ ఈ. స్వామి, రాజమహేంద్రవరం జిల్లా ఫైర్ అధికారి మార్టిన్ లూధర్ కింగ్, పశ్చిమ గోదావరి జిల్లా ఫైర్ అధికారి డి. శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా ఫైర్ అధికారి శంకర్రావు, మచిలీపట్నం జిల్లా ఫైర్ అధికారి ఏసురత్నం, నార్త్ జోన్ అసిస్టెంట్ జిల్లా ఫైర్ ఆఫీసర్లు, సిబ్బంది పాల్గొన్నారు. జాతీయ రహదారిపై వాహనాలు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులను కాపాడే మాక్ డ్రిల్ విద్యార్థులను ఆకట్టుకుంది.