User Avatar Devotional, News

మహాశివరాత్రి కి చిన్నారులు తయారు చేస్తున్న మట్టి శివ లింగాలు…

ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా రాజనగరం గ్రామ శివారులో ఉన్న ఎస్పీఆర్ న్యూ సిటీలో నివాసముంటున్న ముగ్గురు చిన్నారులు మట్టితో శివలింగాన్ని తయారు చేసి తమలోని సృజనాత్మకతను చాటుకున్నారు. మండలంలోని పాఠశాలల్లో ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ చదువుతున్న ఈ ముగ్గురు చిన్నారులు దీక్షిత, చైత్ర, హవిష లు బంక మట్టిని సేకరించి తమ చిట్టి చిట్టి చేతులతో శివలింగాన్ని తయారు చేసి, పలువురి ప్రశంసలు అందుకున్నారు.