User Avatar News

చాగన్నాడు ఎత్తి పోతలపధకం పిల్ల కాలువ ఆక్రమణలు తొలగింపు

చాగన్నాడు ఎత్తిపోతుల పధకం పిల్ల కాలువ ఆక్రమణ గురైంది. దీంతో రైతులు ఆందోళన చెందడంతో హుటాహుటిన అధికారులు పరిశీలించి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అనంతరం ప్రొక్లెయిన్ తో ఆక్రమణకు గురైన కాలువను తొలగించారు. రాజానగరం జాతీయ రహదారి ప్రక్కన కాలవచర్ల సెంటర్ సమీపంలో ఐయిసర్ వెహికల్స్ రిపేర్ చేసే కంపెనీ ఆనుకుని చాగన్నాడు ఎత్తి పోతలపధకం ప్రధాన కాలువ నుండి తూర్పుగానుగూడెం గ్రామానికి తాగునీరు, రైతుల పొలాలకు సాగునీరు అందించే పిల్ల కాలువ ఉంది.‌ దీని ఆయకట్టు పరిధిలో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు కాలువను పూడ్చి సిమెంట్ స్థంబాలు వేసి ఐరన్ తీగలతో ఫినిషింగ్ వేసి ఆక్రమించారు. దీనిపై రైతులు ఆందోళన చేయడంతో చాగన్నాడు ఎత్తి పోతలపధకం ఎఈ సత్యనారాయణ కాలువను పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై తహశీల్దార్ జిఎవిఎల్ దేవి, సిఐ ప్రసన్నవీరయ్య గౌడ్ హుటాహుటిన చేరుకుని ప్రొక్లెయిన్ తో ఆక్రమణకు గురైన కాలువను తొలగించారు. ప్రస్తుతం కాలువ నీళ్లు వెళ్ళేందుకు ఇబ్బంది లేకుండా ఆక్రమణలు తొలగించడం జరుగుతుంది అని ఎఈ తెలిపారు. త్వరలోనే సర్వే చేపట్టి కాలువ కాలువను కాపాడడం జరుగుతుందని చెప్పారు.‌ దీనిలో ఆర్ఐ ఆర్.కె. రంభ, విఆర్ఓ సిహెచ్ పాపారావు సిబ్బంది పాల్గొన్నారు.