User Avatar News, Political

రాజానగరం నియోజకవర్గంలో రెండు వర్గాలుగా ఉన్న కేడర్ సమన్వయం చేయగలరా..? జిల్లా రాజానగరం నియోజకవర్గం ఇన్ చార్జి గా బొడ్డు వెంకటరమణ చౌదరి ప్రమాణ స్వీకారం

తెలుగు తమ్ముళ్లు అంతర్గత కుమ్ములాటల మధ్య జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, రాజానగరం నియోజకవర్గం పార్టీ ఇన్ చార్జిగా బొడ్డు వెంకటరమణ చౌదరి  ప్రమాణ స్వీకారణ కార్యక్రమం జరగనుంది. క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్ రెండుగా చీలిపోవడం దీనికి కారణం. ఆయన నియోజకవర్గం ఇన్ చార్జిగా పదవి చేపట్టి రెండేళ్లు పూర్తైనా అయినా ఇప్పటి వరకూ అలాగే ఉన్నాయి. రాష్ట్రంలో ఎన్నికలలో కూటమి ఒప్పందాలు ప్రకారం రాజానగరం నియోజకవర్గం జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ గెలుపుకు క్షేత్రస్థాయిలో నుండి టిడిపి నాయకులు కృషి చేశారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నియోజకవర్గం టిడిపి ఇన్ చార్జిగా ఉన్న బొడ్డు వెంకటరమణ చౌదరి రుడా చైర్మన్ పదవి ఇచ్చారు. దీంతో ఆయన నియోజకవర్గంలో తన వర్గానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తుడడం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ వర్గాన్ని దూరంగా పెట్టారని ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యేగా గెలిచిన బత్తుల బలరామకృష్ణ జనసేన పార్టీ కార్యకర్తలకు మాత్రమే పనులు చేయడం టిడిపి నాయకులను ప్రాధాన్యత ఇవ్వడం లేదు. మరో వైపు బొడ్డు వెంకటరమణ చౌదరి మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వర్గం దూరంగా పెట్టడంతో క్షేత్రస్థాయిలో కేడర్ అసంతృప్తిగా ఉంది. దీంతో తెలుగు తమ్ముళ్లు రెండుగా విడిపోయి ఎవరి పసుపు జెండా వారు పట్టుకుని పార్టీ కార్యక్రమాలు విడివిడిగా చేస్తున్నారు. మరికొందరు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో నూతనంగా ప్రమాణ స్వీకారం చేయనున్న జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గం ఇన్ చార్జిగా బొడ్డు వెంకటరమణ చౌదరి క్షేత్రస్థాయిలో కేడర్ కలుపుకుంటారని ఆశిద్దాం. లేనిచో రాబోయే స్థానిక ఎన్నికల్లో దీని ప్రభావం ఉంటుంది.