User Avatar News

మండపేట నియోజకవర్గం రాయవరం మండలం కూర్మాపురం పెద్ద పులి హల్ చల్.

మండపేట నియోజకవర్గం రాయవరం మండలం కూర్మాపురం పంట పోలాలు, ఇళ్లలో పెద్ద పులి హల్ చల్దీ చేసింది. దీనిని చూసిన ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు.పులి సంచారం చేసిన అన్ని రోజులు గ్రామాలలో రాత్రి సమయంలో పశువులను చంపి తింటున్న విషయం తెలిసిందే. ఇదేవిధంగా కూర్మాపురంలో గేదె దూడను చంపి తిన్నాది. అనంతరం ఇళ్లలోకి ప్రవేసించి గ్రామం చేలలో పరుగులు పెడుతుంది. తొలిత పెద్ద పులి సీతానగరం మండలం చిన కొండేపూడి, పెద కొండేపూడి, తొర్రేడు మీదుగా రాజమహేంద్రవరం రూరల్ మండలం వెంకటాపురం, కొంతమూరు, కోలమూరు, రాజానగరం మండలం దివాన్ చెరువు, శ్రీరాంపురం, రఘునాధపురం, నామవరం, జి. ఎర్రంపాలెం, శాటిలైటీ అక్కమ్మ కొండ నుండి రాయవరం మండలం కూర్మాపురం చేరుకుంది. దీనిని పట్టుకోడానికి అటవీ శాఖ అధికారులు మత్తు ఇంజక్షన్ ఇచ్చారు. ఎటువైపు వెలుతుంది అంచనా వేయలేమని ఎక్కడో ఒకచోట అగుతుందని వెంటనే పెట్టుకుని బోనులో బంధించడం జరుగుతుందని మండపేట ఎమ్మెల్యే  తెలిపారు.