User Avatar News

పామాయిల్ తోటలో మాటు వేసిన పెద్దపులి

గత ఆరు రోజులు పెద్ద పులి సంచారం తెలిసిందే. బుధవారం రాత్రి శాటిలైటీ అక్కమ్మ కొండపై మండలంలో భూపాలపట్నంలో ఒక పెద్ద ఆవు, జి.ఎర్రంపాలెంలో మూడు దూడలు చంపింది. దీనిలో ఒక దూడను తిన్నాది. దీనితో గ్రామం ప్రజలను అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ డి. నరసింహ కిషోర్, ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ట సంఘటన స్థలనికి చేరుకుని పరిస్థితి సమీక్షించరు. అయితే జి. ఎర్రంపాలెం సమీపంలో పామాయిల్ తోటలో పులి దాక్కన్నట్ల భావిస్తున్నారు. ఈ మేరకు అటవీ శాఖ, పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. పూణే పూణె నుండి వచ్చిన ప్రత్యేక బృందం, రాజమహేంద్రవరానికి ప్రత్యేక రెస్క్యూ టీం, సీసీఎఫ్, ఆటవీ బృందాలు చేరుకుని పులి పట్టుకోవడం కోసం ప్రయత్నం వేగంవంతం చేశారు. థర్మల్ డ్రోన్లు, ట్రాప్ కెజ్‌లు, ట్రాప్ కెమెరాలతో పులి జాడలు గుర్తిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సున్నిత స్వభావం కలిగిన వన్యప్రాణి పులికి ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తే మరో ప్రాంతానికి తరలి పోతే పట్టుకోడం కష్టంగా ఉంటుందన్నారు. పులి పరిసర గ్రామాల ప్రజలు ఇళ్లలో ఉండాలని సూసించారు. పులిని బంధించి పట్టుకోడానికి అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ చెప్పారు.  మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, డీఎఫ్వో బి. ప్రభాకర రావు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయగా, అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ పి.వి. చలపతి రావు, సీసీఎఫ్ బి.ఎన్.ఎన్. మూర్తి, డీఎఫ్వో ప్రభాకర రావు, ఎఫ్‌ఆర్‌వో ఎస్. దావీదురాజు నాయుడు, ఎన్టీసీఏ అధికారి రాజశేఖర్, మత్తు వైద్యులు డా. ఫణీంద్ర ఉన్నారు.