User Avatar News

పులి నాలుగో రోజు ఆటో నగర్, పాలచర్ల జీడిమామిడి తోటలో…..

గత నాలుగు రోజులు సంచరిస్తున్ను పెద్దపులి మంగళవారం రాత్రి 9 గంటలకు దివాన్ చెరువు సమీపంలో ఆటో నగర్, పాలచర్ల జీడి మామిడి తోటలో ఉన్నట్టు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. సోమవారం తొర్రేడు, వెంకటాపురం నుండి రంపచోడవరం వైపు అటవీ ప్రాంతంలోకి వెలుతుందని భావించారు. అయితే మంగళవారం గాడాల మీదుగా దివాన్ చెరువు, పాలచర్ల ప్రాంతాల్లో జీడిమామిడి తోటల్లోకి వచ్చిందని అధికారులు తెలిపారు. పులి పట్టుకోడానికి అన్ని ఏర్పాట్లు చేశామని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.