User Avatar News

సీతానగరం మండలం పెద్దకొండెపూడి, చిన్నకొండెపూడి, తొర్రేడు గ్రామాల్లో పులి సంచారం

సీతానగరం మండలం పెద్దకొండెపూడి, చిన్నకొండెపూడి, తొర్రేడు గ్రామాల్లో మూడు రోజులుగా పులి సంచారం కలకలం రేపుతుంది. పెద్దపులి దాడిలో రాజమహేంద్రవరం రూరల్ మండలం తొర్రేడు చెందిన ముగ్గల సత్తిరాజు చెందిన రెండు ఆవులు, దూడ చంపిన విషయం తెలిసిందే. వీటిని అటవీ శాఖ అధికారులు పరిశీలించి పాదముద్రల ఆధారంగా తొర్రేడు వెంకటాపురం వైపు తోటలో పులి ఉన్నట్ల సోమవారం గుర్తించారు. పట్టుకునేందుకు పులిబోను, ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే ఆదివారం ఘటన స్థలంలో డీ.ఎఫ్.ఓ ప్రభాకర్ రావు మీడియాతో మాట్లాడుతుండగా వెనుక వైపు కొద్ది దూరంలో పులి ఒక్కసారి వెళ్లింది. దీంతో అక్కడ ఉన్న ప్రజా ప్రతినిధులు స్థానికులు హడలిపోయి భయాందోళనతలో తలో దిక్కు పరుగులు తీయడానికి ప్రయత్నం ఇస్తుంటే అధికారులు అప్రమత్తమై సురక్షితంగా బయటకు పంపారు. ప్రస్తుతం పులి కడుపునిండా ఆహారం తినడంతో బయటకు రాకపోవచ్చు అన్నారు. తమ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఛత్తీస్‌గఢ్‌ నుంచి మహారాష్ట్ర అడవుల మీదుగా రెండు మగ పులులు వచ్చాయని డీఎఫ్‌వో తెలిపారు. అందులో ఒకటి వికారాబాద్‌లో సంచరిస్తోందని మరొకటి ఇక్కడ ఉన్నట్ల భావిస్తునన్నారు. దీని వయసు మూడేళ్లకు మించి ఉండదని, అవసరాన్ని బట్టి ఒక రాత్రిలో 25 నుంచి 35 కిలోమీటర్లు ప్రయాణిస్తుందిని చెప్పారు. పులిని పట్టుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశామని గ్రామస్థులు రాత్రి సమయాల్లో అప్రమత్తంగా ఉండాలి బయటికి వెళ్లేటప్పుడు ఒంటరిగా వెళ్ళవద్దు అని సూసించారు. పులి సంచారంపై వైరల్ అవుతున్న పాత వీడియోలు, ఫేక్ ఫోక్ ఫొటోలు నమ్మవద్దు అని అధికారులు కోరారు. ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, రుడా ఛైర్మన్‌ బీవీఆర్‌ చౌదరి పులి సంచారం ప్రదేశాలను పరిశీలించారు.