User Avatar Education, News

పులి సంచారంతో సీతానగరం, కోరుకొండ , రాజమండ్రి రూరల్ మండలాల్లో ప్రభుత్వ, ప్రవేటు పాఠశాలలకు సోమవారం సెలవు

పులి సంచారం చేస్తుందని సీతానగరం, కోరుకొండ, రాజమండ్రి రూరల్ మండలాల పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సోమవారం ఒక రోజు సెలవు ఇస్తున్నామని జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు తెలిపారు. విద్యార్థుల భద్రత కోసం ఈ మూడు మండలాల పరిధిలో సుమారు 100కి పైగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయని ఇవి అన్నీ సెలవు ప్రకటించాలని ఇన్ చార్జి జిల్లా కలెక్టర్ వై. మేఘా స్వరూప్ ఆదేశాలు జారీ చేసినట్లు విద్యా శాఖా అధికారి చెప్పారు. అయితే సోమవారం నిర్వహించనున్న ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు యథావిధిగా జరుగుతాయని ప్రాంతీయ ఇంటర్మీడియట్ అధికారి ఐ. శారద తెలిపారు.