User Avatar News

జిల్లాలో 2.71 లక్షల మందికి రూ.118.64 కోట్లు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ.. ఇన్ చార్జి జిల్లా కలెక్టర్ వై. మేఘా స్వరూప్

తూర్పు గోదావరి జిల్లాలో 2,71,344 మంది లబ్ధిదారులకు రూ.118.64 కోట్లు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు ఇన్ చార్జి జిల్లా కలెక్టర్ వై. మేఘా స్వరూప్ తెలిపారు. దీనిలో 4,853 మంది పింఛన్లు పంపిణీ అధికారులు పాల్గొనడం జరుగుతుందన్నారు. రాజానగరం మండలం వెలుగుబంద లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇన్ చార్జి జిల్లా కలెక్టర్ వై. మేఘా స్వరూప్, ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ శనివారం పంపిణీ చేశారు. అనంతరం ఇంచార్జి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఒకిటో తేదీ ఆదివారం వలన ప్రభుత్వం ఆదేశాలు ప్రకారం ఒక రోజు ముందుగా పింఛన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో 15,301 మంది లబ్ధిదారులకు రూ.6,75,32,500 పంపిణీ చేశారని చెప్పారు. దీనిలో డి ఆర్ డి ఏ పి డి బి. నరేష్, ఎంపిడివో జె.ఏ. ఝాన్సీ, ఇన్ చార్జి ఇఓపిఆర్డీ ఫణి కుమార్ తదితరులు పాల్గొన్నారు.