User Avatar News

తిరుమల లడ్డూపై తప్పుడు రాజకీయ చేశారు.. వైకాపా కేంద్ర కమిటీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి

ప్రపంచ పవిత్ర ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదం వైకాపాపై బురద జల్లడానికి తప్పుడు ప్రచారం చేశారని వైకాపా కేంద్ర కమిటీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. దీనిపై రాజానగరం రావులచెరువు గట్టుపై కొలువైన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో కొబ్బరికాయలు కట్టారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర కమిటీ సభ్యురాలు విజయలక్ష్మి మాట్లాడుతూ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం తిరుమల లడ్డూపై రాజకీయాలు చేశారని ఆరోపించారు. దేశంలో అత్యంత దర్యాప్తు సంస్థలు నివేదికలు ఇచ్చినా ఇంకా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయాలు చేస్తున్నారన్నారు. దీనిలో మండల కన్వీనర్ దూలం పెద్ద, గ్రామ సర్పంచ్ కుందేటి ప్రసాద్, మండారపు వీర్రాజు, అడబాల చినబాబు, ప్రగడ చక్రీ తదితరులు పాల్గొన్నారు.