User Avatar Education, News

ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ జవైట్ తో ఐఎస్టిఎస్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల ఎంఓయు

రాజానగరం సమీపంలో ఐఎస్టిఎస్ మహిళా ఇంజినీరింగ్ కళాశాల, ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ XYVITE (జవైట్) కంపెనీ మధ్య విద్యార్థినుల నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమ ఆధారిత శిక్షణ ఉపాధి అవకాశం ఒప్పందంపై శుక్రవారం ఎంఒయం చేసుకున్నారు. కళాశాల చైర్మన్ కల్లెం ఉపేందర్ రెడ్డి, కంపెనీ డైరెక్టర్ ఎంఎస్పి సునీల్ కుమార్, సిటిఓ చెన్నా రెడ్డి ఒప్పందాల పత్రాలపై సంతకాలు చేశారు. దీనిపై కళాశాల చైర్మన్ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ జవైట్ తో ఎంఓయు వలన కళాశాలలో విద్యార్థినులకు మెరుగైన ఉద్యోగం అవకాశాలు వస్తాయని చెప్పారు. జవైట్ కంపెనీ డైరెక్టర్ సునీల్ కుమార్ మాట్లాడుతూ నైపుణ్యం ఉన్న మహిళా యువ ఇంజినీర్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సిటిఓ చెన్నా రెడ్డి మాట్లాడుతూ విద్యార్థినులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, హ్యాండ్స్-ఆన్, ఇండస్ట్రీ స్టాండర్డ్స్‌ అనుభవం కల్పించడం జరుగుతుందన్నారు. దీనిలో ప్రిన్సిపాల్ డాక్టర్ రాజా శ్రీ రావు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రసాద్, వెంకట్రాజు, అశోక్, ఏవో ఇక్బాల్ విద్యార్థులు పాల్గొన్నారు.