User Avatar Education, News

ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో 150 ఏళ్ల వందేమాతరం వేడుకలు

ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఆవరణలో వందేమాతరం 150 ఏళ్ల వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 25 వేల చదరపు అడుగుల జాతీయ జెండా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక, సినిమా ఫొటో గ్రాఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, విసి ఎస్.ప్రసన్న శ్రీ, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి  ఆవిష్కరించి ర్యాలీ ప్రారంభించారు. అనంతరం  విశ్వవిద్యాలయం క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను విసి ఎగురవేశారు. ఈ సందర్భంగా సభలో  మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ విలువలు, విద్యార్థులకు రక్షణగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నారన్నారు. 25 వేల చదరపు అడుగుల జాతీయ జెండా స్టూడెంట్ యునైటెడ్ నెట్ వర్క్ బడవ కృష్ణమూర్తి ఏర్పాటు చేశారు. దీనిలో రిజిస్ట్రార్ స్వామి, డిఎస్పీ దేవి, జిల్లాలో వివిధ కళాశాలల నుంచి వచ్చాన సుమారు 20 వేల మంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.