User Avatar Crime

రాజానగరం పోలీసు స్టేషన్ పరిధిలో సంక్రాంతి పండుగ మూడు రోజులు రూ. 5 కోట్లు నుండి రూ.10 కోట్లు జూదం క్రీడా వ్యాపారం

రాజానగరం పోలీసు స్టేషన్ పరిధిలో కోర్టు ఆంక్షలు ప్రభుత్వం నిబంధనలు తుంగలో తొక్కి సంక్రాంతి పండుగ మూడు రోజులు సుమారు రూ. 5 కోట్లు నుండి రూ.10 కోట్లు జూదం క్రీడా వ్యాపారం జరిగింది. ఇది అంతా కూటమి నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. రాజానగరం పోలీసు స్టేషన్ పరిధిలో ఫరిజిల్లిపేట, శ్రీకృష్ణపట్నం, రాజానగరం ప్రతి కోడి పందాల బోరులో ఒకొక్క పందెం ఒక లక్ష నుండి ఐదు లక్షలు జరిగడంతో ఇక్కడ మూడు రోజులు మెత్తం మూడు కోట్ల రూపాయలుపైగా జూద వ్యాపారం జరిగింది. గుండాల బోర్డులలో మరో రూ. 50 లక్షలు జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇదే విధంగా దివాన్ చెరువు, నరేంద్రపురం, తోకాడ, ముక్కినాడ, పల్గకడియం, పాలచర్గ, సీతారామపురం, నామవరం, రాధేయపాలెం, పాత తుంగపాడు, జి. ఎర్రంపాలెం, కోలమూరు, కొంతమూరు తదితర గ్రామాల్లో భారీగా కోడిపందాల బారులు, గుండాట బోర్డులు ఏర్పాటు చేశారు. పోలీసు అధికారులతో ముందస్తు ఒప్పందాలు కుదరడం వలన కోర్టు ఆకాంక్షలు నిబంధనలు ఉన్నా యధేశ్బగా జూదం క్రీడలు ఏర్పాటు చేశారని ఆరోపణలు వస్తున్నాయి.