User Avatar News, Political

కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుంది… జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయి వేణుగోపాల కృష్ణ

కూటమి ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసం చేస్తుందని వైకాపా జిల్లా వైసిపి అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు. దీనిని ప్రజల్లోకి తీసుకుని వెళ్లి ఎండగట్టాలని పిలుపునిచ్చారు.  దివాన్ చెరువు డిబివి రాజు కళ్యాణ మండపంలో జిల్లాలో ఏడు నియోజకవర్గాల పార్టీ విస్తృత స్థాయి సమావేశం జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశం జరిగింది.  ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ  సచివాలయం పరిధి ప్రామాణికంగా తీసుకుని ఫిబ్రవరి 10వ తేదీ నాటికి కమిటీలు వేయాలన్నారు. అభివృద్ధి పేరుతో లక్షల కోట్లు అప్పులు తీసుకుని వచ్చి ప్రజలపై భారం మోపుతున్నారన్నారు.  వైకాపా పై జరుగుతున్న విషప్రచారాన్ని తిప్పి కొట్టాలని సూచించారు. దీనిలో ఆ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు  జక్కంపూడి రాజా మాట్లాడుతూ పార్టీలో ఎవరు చిత్తశుద్ధితో పనిచేస్తారో, ఎవరు జంపింగ్ చేస్తారో అన్నీ పరిశీలించి కమిటీలు వేయాలి అన్నారు. మాజీ మంత్రి తానేటి వనిత, మాజీ ఎంపి మార్గాని భారత్ రామ్, మాజీ ఎమ్మెల్యేలు జీ. శ్రీనివాస నాయుడు, తలారి వెంకట్రావు,  సత్తి సూర్య నారాయణ రెడ్డి, రౌతు సూర్య ప్రకాశ రావు, పార్లమెంటరీ నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్. రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీమతి మేడపాటి షర్మిల రెడ్డి, పార్లమెంట్ పరిశీలకులు టి.గురు మూర్తి రెడ్డి, టాస్క్ ఫోర్స్ కి సంబంధించి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, నాగార్జున యాదవ్ ,డిసిసిబి మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, మేడా గురుదత్త ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.