User Avatar Education, Entertainment

ఐఎస్టిఎస్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు…

అబార్షన్లు చేయకూడదు అని చట్టాలు ఉన్నా అబార్షన్లు జరుగుతున్నాయని  అని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. దీనిని మహిళలు విద్యతో నిర్మూళన చేయవచ్చు అని తెలిపారు. రాజానగరం సమీపంలో ఐఎస్టిఎస్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు శుక్రవారం నిర్వహించారు. దీనిలో ముఖ్య అతిథిగా ఎంపి పురంధేశ్వరి పాల్గొని గంగిరెద్దుల నాట్యం, విద్యార్థునులు వేసిన ముగ్గులు పిండివంటలు చూశారు. అనంతరం కళాశాల చైర్మన్ కె. ఉపేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో ఎంపి మాట్లాడుతూ మేధా శక్తిలో మహిళలకు మించిన వారు లేరన్నారు. వివిధ విభాగాల్లో ప్రతిభ చూపిన సిబ్బందికి సన్మానం చేసి జ్ఞాపిక అందజేశారు. దీనిలో కళాశాల వైస్ చైర్మన్ కె. అనూష, నీరుకొండ వీరన్న చౌదరి, మోది సత్తిబాబు, సర్పంచ్ గళ్ళా రంగా సత్య శ్రీ తదితరులు పాల్గొన్నారు.