User Avatar Entertainment

గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయంలో దేవగుడి సినిమా ట్రెయిలర్ & ప్రమోషన్

బెల్లం రామకృష్ణారెడ్డి స్వీయ రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవగుడి సినిమా ట్రెయిలర్ ప్రమోషన్ రాజానగరం సమీపంలో గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం ఆవరణలో చాన్సలర్ కెవివివి సత్యనారాయణరాజు సోమవారం సాయంత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకత్వం బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇది ఫ్యాక్షన్, యాక్షన్, రొమాంటిక్ చిత్రంగా నిర్ణయించామన్నారు. హీరోయిన్ అనుశ్రీ మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లా నుండి హైదరాబాద్ వచ్చి హీరోయిన్ గా నటించడానికి ఎన్నో కష్టాలు ఎదుర్కొనన్నారు. అందురూ ధైర్యంగా ఉండి విజయాలు సాధించాలని తెలిపారు. హీరో అభినవ శౌర్య మాట్లాడుతూ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఈ సినిమా అవకాశం ఇచ్చిన దర్శకుడు రామకృష్ణ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. సినిమాలు చేయడం నా జీవితం అని సినిమా కోసం చావడానికి సిద్దం అన్నారు. అనంతరం విద్యార్థులతో హీరో హీరోయిన్ తో విద్యార్ధులు డాన్సులు చేశారు. దీనిలో ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.