User Avatar Crime

పాలు ట్యాంకర్ లారీ ఢీ కొని యువకుడు మృతి

పాలు ట్యాంకర్ లారీ ఢీ కొని పైలా సత్య షణ్ముఖ సాయి(22) అనే యువకుడు మృతి చెందిన సంఘటన రాజానగరం జిఎస్ఎల్ మెడికల్ కళాశాల పెట్రోల్ బంక్ సమీపంలో మంగళవారం జరిగింది. అనకాపల్లి జిల్లా మాకవారిపాలెం మండలం పెదపాడు చెందిన సత్యసాయి యాక్టీట్ మోటారు సైకిల్ పై రాజమహేంద్రవరం వైపుకు వెళుతుండగా వెనుక నుండి పాల లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అతని తల భాగం నుజ్జునుజ్జు అయింది. దీంతో సత్యసాయి అక్కడికక్కడే మృతిచెందాడు. దీనిపై ఎస్ఐ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.