User Avatar Crime, News

కారుతో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఢీ కొని ముగ్గురు యువకులు మృతి..

కారు అదుపుతప్పి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఢీ కొట్టడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన గోకవరం మండలం కొత్తపేట శివారు జీడిపిక్కల ఫ్యాక్టరీ సమీపంలో మంగళవారం జరిగింది. జగ్గంపేట ప్రైవేట్ ట్రావెల్స్ కారు అద్దెకు తీసుకుని స్వంత డ్రైవింగ్ తో ఏడుగురు యువకులు విజయవాడ వెళ్ళి తిరిగి ఇంటికి వెళుతుండగా మార్గమధ్యంలో కొత్తపేట సమీపంలో కారు అదుపుతప్పి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ని ఢీ కొంది. ఈ ప్రమాదంలో మల్లిసాలకు చెందిన కొండిపూడి వివేక్ (17),బల్లిలా పద్మని (18), కందిగట్ల లక్కి(19) యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నాలుగురికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.