User Avatar Education, News

ఈనెల 8వ తేదీన జరుగనున్న APEdCET-2026 ఏర్పాట్లు పూర్తి … 

ఈనెల 8వ తేదీన జరుగనున్న ఉపాధ్యాయ విద్య (బిఇడి) ప్రవేశాల పరీక్షకు APEdCET-2026 అన్ని ఏర్పాట్లు చేశామని ప్రాంతీయ సమన్వయకర్త, ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం విద్యా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కొండ్రు సుబ్బారావు అన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 7 కేంద్రాలలో 2609, పశ్చిమ గోదావరి జిల్లాలో 9 కేంద్రాలలో 2013 అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు సైన్స్ కోర్సుల అభ్యర్థులకు, మధ్యాహ్నం 12:30 గంటల నుండి 2:30 గంటల వరకు ఆర్ట్స్ కోర్సుల అభ్యర్థులకు పరీక్షలు ఉంటాయన్నారు. ఉదయం పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులను ఉదయం 7:30 గంటల నుండి, మధ్యాహ్నం పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులను ఉదయం 11:00 గంటల నుండి పరీక్షా కేంద్రాలలోకి అనుమతిస్తారని నిర్దేశించిన తర్వాత అభ్యర్థులను  కేంద్రాలలోకి అనుమతించరని తెలిపారు. పరీక్ష ప్రారంభమైన తరువాత రెండు సెషన్‌లలో పరీక్ష పూర్తయిన వరకు అభ్యర్థులను బయటకు అనుమతించరని తెలిపారు. అభ్యర్థులు హాల్ టికెట్లను ముందుగానే డౌన్‌లోడ్ చేసుకుని, దానిలో ఉన్న సూచనలను పాటించాలని సూచించారు.